MKOne Telugu Times Business Excellence Awards

గ్రీన్‌కార్డు సులభంగా దక్కేలా అమెరికాలో కొత్త చట్టం.. అమలైతే భారతీయులకు పండగే

గ్రీన్‌కార్డు సులభంగా దక్కేలా అమెరికాలో కొత్త చట్టం.. అమలైతే భారతీయులకు పండగే

అమెరికాలో అధికారిక డెమోక్రటిక్ పార్టీ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయులకు లబ్ధి చేకూరనుంది. బుధవారం నాడు అమెరికా ప్రభుత్వం కొత్త పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టింది. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు పౌరసత్వం త్వరగా దొరికేలా చేయడమే ఉద్దేశంగా ఈ బిల్లును సిద్ధం చేశారు. దీంతో భారతీయులకు చాలా మేలు జరగనుంది. ఈ బిల్లు ప్రకారం గ్రీన్ కార్డు, హెచ్1బీ వీసా విధానాల్లో కొన్ని మార్పులు సూచించారు. గ్రీన్ కార్డుపై దేశాల వారీగా ఉన్న కోటాను తొలగించాలని ప్రతిపాదించారు. యూఎస్ సిటిజన్ షిప్ యాక్ట్ 2023 పేరిట అమెరికా చట్టసభల సభ్యురాలు లిండా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ప్రభుత్వ పరిశీలనలో వీరి వల్ల ప్రమాదం లేదని తేలిన విదేశీయులు పన్ను చెల్లిస్తే పదేళ్ల లోపు పౌరసత్వం కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. స్టెమ్ రంగాల్లో అమెరికా యూనివర్సిటీలలో ఉన్నత చదువులు చదువుకున్న విదేశీయులకు నివాసం మరింత సులభతరం చేయాలనే ప్రతిపాదనలు కూడా ఈ బిల్లులో చేర్చారు. గ్రీన్ కార్డులు త్వరగా జారీ అయ్యేందుకు కొన్ని సూచనలు పొందుపరిచారు. హెచ్1బీ వీసాదారులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు పని చేసుకునే వీలు కల్పించాలని బిల్లులో పేర్కొన్నారు. హెచ్1బీ వీసాదారుల పిల్లలు వయోపరిమితి దాటితే దేశాన్ని వీడాలనే నిబంధనలో కూడా కొన్ని మార్పులు ప్రతిపాదించారు.

 

 

Tags :