కేంద్రంలో మళ్లీ ఎన్డీయే పాగా .. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే

కేంద్రంలో మళ్లీ ఎన్డీయే పాగా .. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే

దేశంలో లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్‌ సర్వే అంచనా వేసింది. బీజేపీ సారధ్యంలో ఎన్డీయేకు 362, కాంగ్రెస్‌ పార్టీ సారధ్యంలోని యూపీఏకు 97 స్థానాలు లభిస్తాయని, ఇతరులు 84 స్థానాల్లో గెలుస్తారని సర్వే వెల్లడించింది. ర్ఱాష్టాల వారీగా ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని సర్వేలో తేలింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముందు ఉందని సర్వే వెల్లడించింది. మొత్తంగా కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్‌ ఖాయమని, మళ్లీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది. కాగా తెలంగాణలో బీజేపీ ఈసారి 6 ఎంపీ సీట్లు గెలుచుకోబోందని టీవీ-మ్యాట్రిజ్‌ సర్వే అంచనా వేసింది. ఎన్డీయే పక్షాలకు 42 శాతం ఓటింగ్‌ రాబోతుందని  సర్వేలో వెల్లడించింది.

 

Tags :