బెజవాడ ఈస్ట్‌ టికెట్‌పై దేవినేని అవినాష్‌కి గురి.. వైసీపీ ప్లాన్ కూడా అదేనా..!?

బెజవాడ ఈస్ట్‌ టికెట్‌పై దేవినేని అవినాష్‌కి గురి.. వైసీపీ ప్లాన్ కూడా అదేనా..!?

బెజవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పార్టీ నేత దేవినేని అవినాష్ దూకుడు పెంచారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న అవినాష్.. ఎలాగైనా 2024లో నియోజకవర్గ టికెట్ దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యనే నియోజకవర్గాల సమీక్షలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు అవినాష్‌కే టికెట్ ఖాయం అన్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో పట్టు సాధించి టికెట్ పట్టేయాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే దానికోసం ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పోకుండా మొత్తం క్యాడర్‌ని నియంత్రిస్తూ సంయమనంగా ముందుకెళ్లాలని ట్రై చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బెజవాడ తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ చేతుల్లో ఉంది. 2014 ఎన్నికలతో పాటు 2019 ఎన్నికల్లో కూడా గద్దె రామ్మోహనరావు ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈ సారి ఈ అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ కూడా పట్టుదలగా ఉంది. దాంతో యువకుడు, చురుకైన అభ్యర్థికి ఈ సీటు కట్టబెట్టాలని సీఎం జగన్ ఆలోచనలో ఉన్నారని, ఆయన దృష్టిలో అవినాష్ కూడా ఉన్నారని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. మరి ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో తెలియాలి.

 

Tags :