అవసరమైతే వారి కోసం జైలుకు వెళతాను

అవసరమైతే వారి కోసం జైలుకు వెళతాను

పోలవరం నిర్వాసితుల కోసం అవసరమైతే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళతానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులను చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకువెళతామన్నారు. పోలవరం నిర్వాసితులు సమస్యలతో గగ్గోలు పెడుతుంటే జగన్‌ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో పబ్జీ ఆడుకుంటున్నారని విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డి  2013  భూసేకరణ చట్టం చదివి వాస్తవాలు మాట్లాడాలన్నారు.

 

Tags :