టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా (ఎఫ్ఏసీ) ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆయన టీటీడీ అదనపు ఈవోగా ఉన్నారు. ఇప్పటి వరకు టీటీడీ ఈవోగా ఉన్న డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవోగా రిలీవైన జవహర్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఈ పదవిలో ఉన్న 19 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, పలు కార్యక్రమాలు ఇంకా పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత బోర్డు, కొత్త ఈవోగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ పదవీ కాలంలో సహకరించిన ధర్మకర్తల మండలికి, టీటీడీ అధికారులకు ఉద్యోగులకు కృజ్ఞతలు తెలిపారు.
Tags :