అయ్యప్ప స్వామికి వజ్రాల కిరీటం ఇచ్చిన నంద్యాల భక్తుడు

అయ్యప్ప స్వామికి వజ్రాల కిరీటం ఇచ్చిన నంద్యాల భక్తుడు

శబరిమల అయ్యప్ప స్వామికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు వజ్రాల కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మారం వెంకటసుబ్బయ్య శబరిమల అయ్యప్ప స్వామికి వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటం బహుకరించారు. శబరిమల ఆలయంలో కేరళ హైకోర్టు న్యాయవాది సాయంతో కిరీటాన్ని శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడికి అందజేశారు. గతేడాది కరోనా బారిన పడిన సమయంలో తాము కోలుకోవాలని వెంకటసుబ్బయ్య మొక్కుకున్నారు. ప్రస్తుతం ఆ మొక్కులో భాగంగా కిరీటాన్ని బహుకరించారు. 

 

Tags :