కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్!

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ పదవి కోసం సీనియర్ నేతలు శశిథరూర్, అశోక్ గెహ్లోట్ పోటీ పడుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ పోటీలో మరో సీనియర్ నేత కూడా చేరబోతున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక నేత, కాంగ్రెస్ కు ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న దిగ్విజయ్ సింగ్ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోతున్నారని వార్తలు వినిపస్తున్నాయి. గురువారం నాడు సోనియా గాంధీతో ఆయన భేటీ అవబోతున్నారు. దీంతో పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికల గురించి చర్చించేందుకు ఆయన సోనియాను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. అంతకుముందు శశిథరూర్, గెహ్లోట్ కూడా సోనియాతో సమావేశం అయ్యారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ గురువారం నాడు విడుదలైంది. దీని ప్రకారం, అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఈ నెల 24 నుంచి 30 వరకు సాగుతుంది. అలాగే నామినేషన్లు వెనక్కు తీసుకోవడానికి అక్టోబర్ 8 వరకు సమయం ఇచ్చారు. అక్టోబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఫలితాలను అక్టోబర్ 19న విడుదల చేస్తారు.

 

 

 

Tags :