మా అధ్యక్షుడు మంచు విష్ణు ను కలిసిన దిల్ రాజు

మా అధ్యక్షుడు మంచు విష్ణు ను కలిసిన దిల్ రాజు

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమస్య పరిష్కారం కోసం షూటింగ్స్ బంద్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథయంలోనే హీరో మంచును ప్రొడ్యూసర్ దిల్ రాజు కలిశారు. మా ప్రెసిడెంట్, హీరో మంచు ను ప్రొడ్యూసర్ దిల్ రాజు  కలిశారు. ఆయన కార్యాలయంలో కలిసిన దిల్ రాజు.. పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం మా అసోసియేషన్‌లో ఉన్న సభ్యులతో పాటు కొత్త వారిని కూడా ప్రోత్సహించాలని దిల్ ‌రాజును విష్ణు కోరారు. అదేవిధంగా ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశం ఇచ్చి.. 'మా' కుటుంబంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్‌ రాజుకు అందించారు.

అదేవిధంగా 'మా' సభ్యులకు సినిమాల్లో అవకాశాలు కల్పించాలని ప్రొడ్యూసర్లను కలవనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్తంగా షూటింగ్స్ ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాయి. టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై చర్చించి.. పరిష్కరం దొరికే వరకు షూటింగ్స్ ప్రారంభించమన్నారు. షూటింగ్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామో త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పాటు పలువురు నిర్మాతలు మంచు విష్ణును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 'తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సుప్రీం. అన్ని రకాల షూటింగ్స్ ఆపేశాం. సమస్యలపై నాలుగు కమిటీలు వేశాం. అన్ని సమస్యలపై చర్చిస్తున్నాం. పరిష్కారం దొరికిన తరువాత షూటింగ్ ప్రారంభించే విషయంపై ప్రకటిన చేస్తాం..' అని ఈ సందర్భంగా దిల్ రాజు ప్రకటించారు.

https://twitter.com/iVishnuManchu/status/1555058278362517505

 

Tags :