MKOne Telugu Times Youtube Channel

డింపుల్ అజ్మీరా విజయం... రికార్డు

డింపుల్ అజ్మీరా విజయం... రికార్డు

అమెరికాలో భారత సంతతి మహిళ సత్తా చాటారు. ఛార్లెట్‌ సిటీ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ఇండియన్‌ అమెరికన్‌ డింపుల్‌ అజ్మీరా విజయం సాధించారు. ఛార్లెట్‌ కౌన్సిలర్‌గా వరుసగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో అజ్మీర్‌పై డెమొక్రాట్‌ బ్రాక్స్‌టన్‌ విన్‌స్టన్‌ పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా స్పందించిన అజ్మీర్‌.. సంతోషం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 2017లో తొలిసారిగా అజ్మీరా.. ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె.. సిటీ కౌన్సిల్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికైన మొదటి ఆసియన్‌ అమెరికన్‌, అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. గుజరాత్‌లో పుట్టి పెరిగిన అజ్మీరా.. తన తల్లిదండ్రులతో కలిసి 16ఏళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లారు. సౌతర్న్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్‌ పొంది.. లాస్‌ ఏంజెల్స్‌లో సీపీఏగా పని చేశారు. 

 

Tags :