ఎన్టీఆర్ పేరుపై ఏపీ అసెంబ్లీలో రచ్చ.. సభ వాయిదా

ఎన్టీఆర్ పేరుపై ఏపీ అసెంబ్లీలో రచ్చ.. సభ వాయిదా

ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారం సభను వాయిదా వేశారు. బుధవారం సభ మొదలైన వెంటనే ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పచడంపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చొద్దంటూ టీడీసీ సభ్యులు ఆందోళన చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు మార్చామా? అంటూ టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. రాజకీయంగా ఈ స్థానంలో కూర్చున్నారంటేనే దానికి కారణం ఎన్టీఆర్ అని స్పీకర్‌తో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్ఆర్ హర్టీ కల్చర్ యూనివర్సిటీ పేరు తాము అధికారంలో ఉన్నప్పుడు మార్చామా? అంటూ టీడీపీ సభ్యులు గొడవ చేశారు. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో.. వెనక్కి వచ్చి సీట్లలో కూర్చొని అడగాలని మంత్రి అంబటి సూచించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లును వెనక్కు తీసుకోవాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఎన్టీఆర్ జోహర్.. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంలో ఎన్టీఆర్ గురించి మట్లాడే  హక్కు బుచ్చియ్య చౌదరికి మాత్రమే ఉందని అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉండబట్టే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. అయితే వైద్యరంగంలో వైఎస్ఆర్ ఎంతో చేశారని, ఆరోగ్యశ్రీతో పాటు అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పిన వైసీపీ నేతలు.. అందుకే ఆయన పేరు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు.

 

Tags :