ఇప్పట్లో ఎన్టీఆర్ తో చిత్రం ప్లానింగ్ లేదని తేల్చి చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

డైలాగ్ రైటర్ కెరీర్ మొదలుపెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నా అనిల్ రావిపూడి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయబోతున్నారంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ మూవీ తరువాత ఎన్టీఆర్‌తోనే మూవీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై అనిల్ రావిపూడి నుంచి క్లారిటీ వచ్చేసింది. 'రాజా ది గ్రేట్' మూవీతో డైరెక్టర్‌గా హిట్ కొట్టి.. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు ఈ క్రేజీ దర్శకుడి నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా.. మూవీ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా డిస్కస్ చేసుకుంటారు. ప్రస్తుతం అనిల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎఫ్3 మూవీ మే 27న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎఫ్3 టీమ్ బిజీబిజీగా ఉంది.
ఈ ఈ మూవీ విడుదల తరువాత అనిల్ రావిపూడి బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నారు. సెప్టెంబర్‌లో బాలయ్యతో మూవీ స్టార్ట్ చేసే అవకాశముంది. ఆ తరువాత ఎన్టీఆర్‌తో సినిమా చేస్తారనే వార్తలపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌తో మూవీ డిస్కర్షన్ జరగలేదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఎన్టీఆర్‌తో ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాలేదని గాలి వార్తలకు చెక్ పెట్టారు. తన నెక్ట్స్ మూవీ బాలకృష్ణతో ఉంటుందని చెప్పారు. ఎఫ్2 సినిమాతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ఆయన.. F3 మూవీతో అంతకుమించి డబుల్ డోస్‌తో ప్రేక్షకులను నవ్విస్తామని అంటున్నారు. 'లైఫ్ అంటే ఇట్ట ఉండలా' సాంగ్‌లో పూజా హెగ్డే, వరుణ్ తేజ్‌తో కలిసి స్టెప్పులేసిన అనిల్.. ఆ వీడియోను ట్వీట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎఫ్2కు సీక్వెల్‌లో వస్తున్న ఎఫ్3 మూవీలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా.. మే 27న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ల రేట్లను పెంచబోమని దిల్ రాజ్ ప్రకటనతో సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్3 మూవీ విడుదల కోసం ఆడియోన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్ సోగ్గాళ్ల నవ్వుల సునామీ ఎలా ఉంటుందో అని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌గా మారింది.