పవన్‌కళ్యాణ్, దేవా కట్టా కాంబో లో మూవీ?

పవన్‌కళ్యాణ్, దేవా కట్టా కాంబో లో మూవీ?

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఇటీవల సాయి ధరమ్‌ తేజ్‌తో ‘రిపబ్లిక్‌’ సినిమా రూపొందించిన దేవా కట్టాతో అని టాక్. రాజకీయాల కోసం మూడు సంవత్సరాల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. అయితే కొన్ని నెలల క్రితం ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్‌గా తెలుగులో రూపొందిన ‘వకీల్‌సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అంతేకాక.. మంచి కథలు దొరికితే.. కొత్త సినిమాలకు కూడా ఓకే చెప్పేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం పవన్‌.. మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరోగా రానా దగ్గుబాటి చేస్తుండగా.. నిత్య మీనన్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు ఆయన క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాలతో పాటు.. ఆయన మరో సినిమాకు కూడా ఓకే చెప్పారట. అది రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్‌తో ‘రిపబ్లిక్’ సినిమా రూపొందించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు దేవా కట్టాతో అని టాక్ వినిపిస్తుంది. రిపబ్లిక్ సినిమా తర్వాత దేవా కట్టా దర్శకత్వం పవన్‌కు నచ్చడంతో.. తన కోసం ఓ కథ రావాలని పవన్‌ కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆనందంతో దేవా కట్టా అంగీకరించారు అని సమాచారం. ప్రస్తుతం ఆయన పవన్‌ కోసం సినిమా కథని తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారట. పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

 

Tags :