దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం

వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న గుణ శేఖర్ తెలుగులో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించారు. వాటిలో సొగసు చూడ తరమా? బాల రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి వంటి హ్యుజ్ బడ్టెజ్ చిత్రాలున్నాయి. అయితే ఈ దర్శకుడి ఇంటపెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన కుమార్తె నీలిమ గుణ త్వరలోనే మెట్టినింట అడుగు పెట్టనుంది. రవి ప్రక్యా అనే బిజినెస్ మేన్‌తో నీలిమ గుణ పెళ్లి జరగుతుంది. ఈ రోజు 02.12.2022 అర్ధ రాత్రి 12:35 నిమిషములకు (3వ తేదీ) హైదరాబాద్ చారిత్రాత్మక అంతఃపురం తాజ్ ఫలక్ నుమా పాలస్ లో జరుగనుంది. ఈ సందర్భంగా నెట్టింట ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మ్యారేజ్ లైవ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది.
తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనదైన మార్క్ క్రియేట్ చేసిన వ్యక్తి గుణ శేఖర్. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ వంటి ట్రెండ్‌కు తగ్గ చిత్రాలతో పాటు రుద్రమదేవి, రుద్రమదేవి వంటి హిస్టారికల్ మూవీని కూడా తెరకెక్కించారు. సినిమాలను విజువల్ ఫీస్ట్‌లా భారీ బడ్జెట్, సెట్స్‌తో తెరకెక్కించటంలో ఆయనదొక శైలి. ఈ డైరెక్టర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె నీలిమ గుణ పెళ్లి జరుగుతుంది. కొన్నాళ్లు ముందు రవి ప్రక్యా అనే బిజినెస్‌మేన్‌తో నీలిమ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. నీలిమ గుణ, రవి ప్రక్యా సహా ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నీలిమ గుణ ప్రస్తుతం గుణ శేఖర్ తెరక్కిస్తోన్న శాకుంతలం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది దుష్యంతుడు, శకుంతల మధ్య నడిచిన ప్రేమ గాథ. ఈ పౌరాణిక గాథను గుణ శేఖర్ అందమైన పొయెటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కిస్తున్నారు. సమంత ఇందులో శకుంతలగా నటిస్తుంటే.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.
Tweet: https://twitter.com/GunaaTeamworks/status/1598611567750569984