'జాతీయ రహదారి' ట్రైలర్ విడుదల చేసిన రాఘవేంద్రరావు

'జాతీయ రహదారి' ట్రైలర్ విడుదల చేసిన రాఘవేంద్రరావు

మధు చిట్టె, సైగల్‍ పాటిల్‍, మమత, ఉమాభారతి తదితరులు ప్రధాన పాత్రల్లో నరసింహ నంది తెరకెక్కించిన చిత్రం జాతీయ రహదారి. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‍ను దర్శకుడు రాఘువేంద్రరావు ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్‍ చాలా గొప్పగా ఉంది. హృదయాల్ని హత్తుకునేలా ఉంది. సినిమా దర్శక నిర్మాతల కెరీర్‍లో ఓ మైలురాయిలా నిలుస్తుంది అన్నారు. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ట్రైలర్‍ విడుదల కావటం నా అదృష్టం. సినిమా ఈనెల 10న అన్ని థియేటర్లలో విడుదలవుతుంది అన్నారు నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ నన్ను నమ్మి నాకీ అవకాశమిచ్చిన నిర్మాతకి డబ్బులతో పాటు అవార్డులూ వస్తాయి. సినిమా అందరినీ మెప్పిస్తుందన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు ఛాయాగ్రహణం: యస్‍.మురళి మోహన్‍ రెడ్డి.

 

Tags :