విరూపాక్షలో ముందు అనుకున్న విలన్ ఎవరంటే

సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ సినిమా విరూపాక్ష. హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో వంద కోట్ల గ్రాస్‌ను సాధించింది. రీసెంట్‌గా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో సినిమా రన్ అవుతుంది.
ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటికొచ్చాయి. రీసెంట్ గా డైరెక్టర్ కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో విరూపాక్ష స్క్రిప్ట్ లో సుకుమార్ చేసిన మార్పుల గురించి, ఆ మార్పుల వల్ల విరూపాక్ష అవుట్ పుట్ ఎంతో మెరుగ్గా వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ సీనియర్ అనుభవం ఎలా ఉపయోగపడుతుందో ఇది చూశాక అర్థమైందని కార్తీక్ చెప్పుకొచ్చాడు.
విరూపాక్ష లో అసలు చేతబడులు చేస్తుందెవరనేది క్లైమాక్స్ వరకు ఎక్కడా రివీల్ చేయకుండా చాలా పకడ్భందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. క్లైమాక్స్ కు వచ్చేసరికి హీరోయినే ఇదంతా చేస్తుందని తెలుసుకున్న ఆడియన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. వాస్తవానికి ఈ సినిమాలో విలన్ గా కార్తీక్ రాసుకున్నది శ్యామల్ క్యారెక్టర్ అట. ఆ ప్రకారమే స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడట.
కానీ అలా అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదని, హీరోయిన్ పాత్రకే ట్విస్ట్ పెట్టడం కరెక్ట్ అనుకుని స్క్రీన్ ప్లే మార్చారని కార్తీక్ చెప్పాడు. నిజంగా ముందు అనుకున్నట్లు శ్యామలను విలన్ గా చూపించి ఉంటే సుకుమార్ చెప్పినట్లు సినిమాలో థ్రిల్ మిస్ అయ్యేది. ఏదేమైనా సరే ఇలాంటి సినిమాలకు సుకుమార్ లాంటి మాస్టర్ మైండ్ వెనుక ఉండి సపోర్ట్ చేయడంతో సినిమా 100% సక్సెస్ సాధించింది. ఓటీటీలో కూడా సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయని సమాచారం.