మాస్ మూవీస్ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.నాగేశ్వ‌ర‌రావు కన్నుమూత

మాస్ మూవీస్ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.నాగేశ్వ‌ర‌రావు కన్నుమూత

శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.నాగేశ్వ‌ర‌రావు నిన్న శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 26) హ‌ఠాన్మ‌రణం చెందారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంభందించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. నవంబర్ 26న ఏలూరు నుండి తిరిగి వస్తూ.. ఫిట్స్ వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.. వెంటనే ఆయన్ని దగ్గరలో వున్న హాస్పిటల్‌కు వెంటనే తరలించారు. చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఈ రోజు  ఆయన స్వస్థలం అయిన కోయిలగూడెం దగ్గరలోని పోతవరంలో శనివారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ.. పోలీస్, దేవా, సాంబయ్య చిత్రాలను రూపొందించి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు. ఆతర్వాత శ్రీహరితోనే శ్రీశైలం వంటి విజయవంతమైన మరో చిత్రాన్ని కూడా రూపొందించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో ‘వైజయంతి’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. రీసెంట్‌గా ‘బిచ్చగాడా మజాకా’ చిత్రాన్ని తెరకెక్కించారు.

 

Tags :