అన్ని కమర్షియల్ అంశాలతో "రాజయోగం" ట్రైలర్ ఆకట్టుకుంది - దర్శకుడు మారుతి

అన్ని కమర్షియల్ అంశాలతో "రాజయోగం" ట్రైలర్ ఆకట్టుకుంది - దర్శకుడు మారుతి

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "రాజయోగం" . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందన్న ఆయన చిత్ర బృందానికి విశెస్ తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ..."రాజయోగం" ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో రొమాన్స్, యాక్షన్, కామెడీ వంటి అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. నా స్నేహితుడు గణపతి ఈసారి కంప్లీట్ కమర్షియల్ సినిమా చేశాడు. హీరో సాయి రోనక్ కు కూడా మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ లో ప్రతిభ చూపించారు. ఇండస్ట్రీలో ఉన్న పేరున్న కమెడియన్లంతా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. నిర్మాత మణి లక్ష్మణ్ గారికి కంగ్రాంట్స్. ఈ సినిమా యూనిట్ అందరికీ రాజయోగం తీసుకురావాలని
కోరుకుంటున్నా. అన్నారు.

"రాజయోగం" చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ కు మంచి అప్లాజ్ వస్తుండగా... తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు పెంచుతోంది.

 

 

 

Tags :