భక్తుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్ష‌మించాలి! ‘సర్కారు వారి పాట‌’ లో డైలాగ్‌ పై క్లారటీ ఇచ్చిన ప‌ర‌శురామ్

భక్తుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్ష‌మించాలి!  ‘సర్కారు వారి పాట‌’ లో డైలాగ్‌ పై క్లారటీ ఇచ్చిన ప‌ర‌శురామ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట‌’. ఈ సినిమాకు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. మే 12న విడుద‌లైన ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. అయితే ఈ సినిమాలో ఓ డైలాగ్ కొంతమందికి న‌చ్చ‌లేదు. అది కూడా న‌ర‌సింహ స్వామి భ‌క్తుల‌కు. ఇంత‌కీ స‌ద‌రు భ‌క్తుల‌ను ఇబ్బంది పెట్టేలా ప‌ర‌శురామ్ త‌న డైరెక్ట్ చేసిన ‘సర్కారు వారి పాట‌’ చిత్రంలో ఏం చేశార‌నే సందేహం రాక మాన‌దు. దీనిపై పరశురామ్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..వివ‌రాల్లోకి వెళితే.. ఓ సంద‌ర్భంలో మ‌హేష్‌తో విల‌న్‌గా న‌టించిన స‌ముద్ర‌ఖ‌ని పాత్ర‌ధారి మాట్లాడుతూ సింహాచలంలో న‌ర‌సింహ‌స్వామి ఏడాదంతా చంద‌నంతో క‌ప్పి ఉంచుతారు. ఎందుకంటే ఆయ‌న నిజ స్వ‌రూపం భ‌యంక‌రంగా ఉంటుంది. చూస్తే త‌ట్టుకోలేరు అని అంటారు. అయితే ఇందులో త‌ప్పెక్క‌డ ఉందనే అనుమానం కూడా వ‌స్తుంది.

అస‌లు విష‌యం ఏంటంటే ఓ విల‌న్‌ని న‌ర‌సింహ‌స్వామితో పోల్చుతూ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఆ డైలాగ్‌ను రాయ‌టం న‌ర‌సింహ‌స్వామి భ‌క్తుల‌కు న‌చ్చ‌లేద‌ట‌. రీసెంట్‌గా డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ సింహాచ‌లంలోని న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఆ స‌మ‌యంలో ఈ విష‌యంపై ఆయ‌న్ని ప్ర‌శ్నించ‌గా తాను న‌రసింహ‌స్వామికి పెద్ద భ‌క్తుడిన‌ని, ‘సర్కారు వారి పాట‌’ సినిమాను ప్రారంభించే ముందు కూడా స్వామి వారిని ద‌ర్శించుకున్నాన‌ని తెలిపారు. సినిమాలో డైలాగ్‌ను కావాల‌నే చేయ‌లేద‌ని. ఒక‌వేళ ఆ విష‌యంలో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ తిని ఉంటే క్ష‌మించాల‌ని ఆయ‌న తెలిపారు. ‘సర్కారు వారి పాట‌’ సినిమా వంద కోట్ల‌కు పైగా షేర్ వ‌సూళ్ల‌ను సాధించి మ‌హేష్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.ఇదే సంద‌ర్భంలో ప‌ర‌శురామ్ త‌న త‌దుప‌రి చిత్రం గురించి మాట్లాడుతూ 14 రీల్స్ ప్ల‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో నాగ చైత‌న్య‌తో సినిమా చేయాల్సి ఉంద‌ని, ఆ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

 

Tags :