రాజమౌళిని ఆకాశానికెత్తేసిన తేజ

ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా పేరున్న తేజ, గత కొంతకాలంగా లైమ్ లైట్ లో లేకుండా పోయాడు. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వాడ్ గా చెప్పే తేజ మాటలు, తేజ చేసే వ్యాఖ్యలు చాలా మందికి నచ్చుతాయి. రీసెంట్‌గా తేజ ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాప్స్ కు రీజన్ చెప్తూనే, దర్శకధీరుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు.
తాను ఎమోషనల్ పర్సన్ అని చెప్పిన తేజ, కొంచెం హర్ట్ అయినా చేసే పని మీద ఫోకస్ చేయలేనని, సినిమా మధ్యలోనే డీవియేట్ అయిపోయి ఎదుటి వాళ్లు సినిమాలో ఏం కోరుకుంటున్నారో అది తీసి ఇచ్చేస్తా తప్పించి, తను అనుకున్నది తీయలేనంటూ చెప్పాడు. అలా చేయడం వల్లే తన చాలా సినిమాలు ఫ్లాపులుగా మిగిలిపోయాయని తేజ పేర్కొన్నాడు.
ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ, త్వరలోనే రాజమౌళి వల్ల ఇండియాలో రూపాయి వాల్యూ పెరగనుందని వ్యాఖ్యానించాడు. అమెరికన్ సినిమాలు చూడటం వల్ల డాలర్ రేటు పెరిగిందని, ఇప్పుడు రాజమౌళి తీసే తెలుగు సినిమాల వల్ల త్వరలోనే రూపాయి విలువ పెరగనుందని తేజ జోస్యం చెప్పాడు. ఇక పోతే తేజ ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే సినిమా చేశాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత జూన్ 2న రిలీజ్ కావడానికి ప్లాన్ చేసుకుంది. మరి తేజ ఈ సారైనా అహింస తో ప్రేక్షకుల్ని మెప్పిస్తాడేమో చూడాలి.