ఆ సమావేశం హిందువులకు వ్యతిరేకమే- సెనెటర్ నీరజ్అంతానీ

ఆ సమావేశం హిందువులకు వ్యతిరేకమే- సెనెటర్ నీరజ్అంతానీ

అమెరికాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న ‘డిస్మాంట్లింగ్‍ గ్లోబల్‍ హిందుత్వ’ సమావేశంపై ఒహాయో స్టేట్‍ సెనేటర్‍ నీరజ్‍ అంతానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది కచ్చితంగా హిందూ వ్యతిరేక సమావేశమే అంటూ ఆయన తేల్చిచెప్పారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న హిందువులపై ఒక నీచమైన దాడిని ఈ సమావేశం ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం జాతివిద్వేషం, మూర్ఖత్వం మాత్రమే. దీన్ని అందరూ ఖండించాలి. హిందుఫోబియాకు వ్యతిరేకంగా నేను ఎల్లప్పుడూ బలంగా నిలబడతాను అని నీరజ్‍ ఒక ప్రకటన విడుదల చేశారు. సాధ్యమైనంత బలంగా ఈ డిస్మాంట్లింగ్‍ గ్లోబల్‍ హిందుత్వ సమావేశాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికాలోని చరిత్రలో ఎన్నికైన అత్యంత చిన్న హిందూ అధికారి నీరజ్‍. అలాగే  ఒహాయో చరిత్రలో సెనేటర్‍గా గెలిచిన తొలి ఇండియన్‍ అమెరికన్‍ కూడా.

కాగా సెప్టెంబరు 10-12 మధ్య ఈ సమావేశం జరుగుతుందని తెలిసినప్పటి నుంచి అమెరికాలోని పలు హిందూ సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా ఉన్న యూనివర్సిటీలకు మెయిల్స్ పంపి.. తమ స్పాన్సర్‍షిప్‍ను వెనక్కు తీసుకోవాలని ఈ సంఘాలు విన్నవించాయి.

 

Tags :