తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు రగ్గులు, చీరల పంపిణీ

తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి సహకారంతో అనంతపురం నగరంలో గల వృద్ధాశ్రమాలలో గల 200 మంది వృద్ధులకు రగ్గులు, చీరలను మాజీ కార్పొరేటర్ పరిమి రాజారావు ఆధ్వర్యంలో సెయింట్ విన్సెంట్ డి. పాల్ వృద్ధాశ్రమము, సురక్ష వృద్ధాశ్రమము, ఆశ్రమ వృద్ధాశ్రమమునందు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో బెల్లం మారుతి, సతీష్, సుధాకర, చౌదరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Tags :