డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ విరాళం

డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ విరాళం

ఖమ్మం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 30 మంది వీధిబాలల పిల్లలకు ఒక్కొక్కటి రూ.1000 విలువ చేసే 30 ట్రంకు పెట్టెలు ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ కుమార్ గారు, సీపీ శ్రీ విష్ణు వారియర్ గారు అందించారు. కలెక్టర్ శ్రీ గౌతంకుమార్ గారి సూచన మేరకు డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ వారు స్పందించి పాఠశాల SO శ్రీమతి విరిత గారికి అందించారు. వివిధ ప్రాంతాలనుంచి ఈ పాఠశాలలో చదివే చిన్నారులకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు పూర్తి చేయుతను ఇస్తున్నాయని, ఈ సందర్భంగా NRI ఫౌండేషన్ చేస్తున్న వివిధ స్వచ్చంద కార్యక్రమాలను అభినందించారు. విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న నిర్వాహకులను CP శ్రీ విష్ణు వారియర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నారై ఫౌండేషన్ కొర్ కమిటీ చైర్మన్ బయ్యన బాబురావు గారు, ఎన్నారై ఫౌండేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావు గారు, అర్జున్ రావు, కృష్ణారావు పాల్గొన్నారు.

 

 

Tags :