రివ్యూ: నవ్వించి కవ్వించిన 'డీజే టిల్లు'

రివ్యూ: నవ్వించి కవ్వించిన 'డీజే టిల్లు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

బ్యానర్: సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ నటీనటులు: :సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శీను తదితరులు

సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకల, థమన్ ఎస్ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్) సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటర్ : నవీన్ నూలి నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ దర్శకుడు: విమల్ కృష్ణ విడుదల తేదీ: 12.02.2022

సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ స్టార్ హీరోల సినిమాలే కాకుండా కంటెంట్ ప్ర‌ధాన‌మైన సినిమాల‌ను రూపొందిస్తూ విజ‌యాల‌ను సొంతం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఈ సంస్థ నుంచి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌రో చిత్రం ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ పెద్ద కాంట్ర‌వ‌ర్సీకి దారి తీశాయి. డీజే టిల్లు చిత్రంలో అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా బ‌లంగానే వినిపించాయి. మ‌రి స‌ర‌దాగా సాగే రొమాంటిక్ కామెడీలా తెర‌కెక్కించిన డీజే టిల్లు ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవండి.

కథ : ఇక కథలోకి వచ్చినట్టు బాల గంగాధ‌ర తిల‌క్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ) ఒక ఫేమస్ డీజే గా తన లైఫ్ ని మస్త్ మజా చేస్తూ కొనసాగిస్తుంటాడు.అయితే అందుకు మంచి బ్రేక్ ఇచ్చే పాట రావాల‌ని గ‌ట్టిగా న‌మ్ముతుంటాడు. ఓ రోజు హోట‌ల్‌లో పాటలు పాడే రాధిక (నేహా శెట్టి)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారి ఇద్ద‌రూ ఒక‌ట‌వుతారు. ఈ విష‌యం రాధిక బాయ్ ఫ్రెండ్ (కిరిటీ దామ‌రాజు)కి తెలియ‌డంతో.. అత‌ను రాధిక‌తో గొడ‌వ ప‌డ‌తాడు. ఆ గొడ‌వ‌లో అనుకోకుండా రాధిక బాయ్ ఫ్రెండ్ చ‌నిపోతాడు. రాధిక భ‌యంతో టిల్లుకి ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుంది. ఇంటికి వ‌చ్చిన టిల్లుకి ప‌రిస్థితి అర్థ‌మ‌వుతుంది. పోలీసుల‌కు ఫోన్ చేస్తే ప‌రిస్థితి పెద్ద‌ద‌వుతుంద‌ని వారు భావిస్తారు. దాంతో రాధిక కోసం టిల్లు శ‌వాన్ని పాతి పెడ‌తాడు. అయితే ఆ శ‌వాన్ని ఒక‌రు వీడియో తీసి టిల్లు, రాధిక‌ను పాతిక ల‌క్ష‌లు డిమాండ్ చేస్తారు. అప్పుడు ఇద్ద‌రూ ఏం చేస్తారు? హ‌త్య కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల హావభావాలు: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, టిల్లు పాత్ర గాని తన టైమింగ్ గాని బాడీ లాంగ్వేజ్ అన్నీ మాంచి యూనిక్ గా చేసాడు. ఇక ఈ పాత్రలో చేసిన సిద్ధూ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇది వరకే తాను ఒక సెటిల్డ్ పెర్ఫామర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ డీజే టిల్లు అనే రోల్ కంప్లీట్ కొత్త మేకోవర్ లో ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్ లో కనిపించాడు. సినిమాలో అయితే తన పాత్రతో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. తన మాట, చేత అన్నీ హిలేరియస్ గా అనిపిస్తాయి. ఖచ్చితంగా సిద్ధూ మున్ముందు మంచి హీరోగా సెట్ అవుతాడు. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ హీరోయిన్ నేహా శర్మ అని చెప్పాలి. తన రోల్ లో తాను ఒక క్లీన్ పెర్ఫామెన్స్ ని ఆమె కనబర్చింది. అయితే తన రోల్ మొదట మరీ అంత వల్గర్ టైప్ లో ఉంటుందా అనే ప్రశ్నకి అయితే మంచి సమాధానమే చిత్రంలో దొరుకుతుంది. ఓ పక్క మంచి బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపించడమే కాకుండా తన గ్లామర్ తో కూడా నేహా ఎక్కడా తగ్గకుండా ఆకట్టుకుంది. మరి ఇంకా సిద్ధూ తో కొన్ని సీన్స్ అయితే మంచి హైలైట్ గా పేలాయి. అలాగే నటుడు బ్రహ్మాజీ మరియు ప్రిన్స్ లు మంచి పాత్రల్లో కనిపించి మెప్పించారు. వీటితో పాటుగా ఎంటర్టైనింగ్ సాగే కథనం సినిమాలో ఆకట్టుకుంటుంది.

సాంకేతికవర్గం పనితీరు: ఇక ఈ చిత్ర దర్శకుడు విమల్ కృష్ణ విషయానికి వస్తే మొదటగా లాజిక్స్ నే పక్కన పెడితే తాను మంచి వర్క్ ఇచ్చాడని చెప్పాలి. తాను డిజైన్ చేసిన టిల్లు పాత్ర దానిని ఆవిష్కరించిన విధానం అన్ని బాగా హ్యాండిల్ చేశారు. అయితే తాను ఎంచుకున్న స్టోరీ లైన్ అంత గొప్పది కాకపోయినా దానిని ఎంటర్టైనింగ్ గా చూపించడంలో మాత్రం తాను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కాకపోతే కొన్ని లాజికల్ ఎర్రర్స్ ని సరిచేసుకోవాల్సి ఉంది. ఇక అలాగే లాస్ట్ మినిట్ లో సినిమా కోసం థమన్ ని దింపి ఇంకో హైలైట్ గా సినిమాకి నిలిపారు. తన పాత్రకి థమన్ మాత్రం మంచి అవుట్ పుట్ ని అందించాడు. అలాగే శ్రీచరణ్ పాకల ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా విజువల్ గా మంచి ట్రీట్ ఇచ్చింది. ఇంకా ప్రకాష్ ఉమ్మడిసింగు ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది తాను మంచి విజువల్స్ ని చూపించాడు. ఇక అలాగే ఈ సినిమాకి సిద్ధూ నే ఇచ్చిన డైలాగ్స్ మాత్రం ఇన్స్టంట్ హిట్ అయ్యాయి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఇచ్చాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారి ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది సినిమా క్వాలిటీ కోసం వారు పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా సూపర్బ్ అని చెప్పాలి.

విశ్లేష‌ణ : ‘డీజే టిల్లు’ రొమాంటిక్ క్రైమ్ కామెడీ. తొలి అర్ధ గంటలో మెయిన్ ప్లాట్‌లోకి వెళ్లిపోతుంది సినిమా. అయితే ఈ క్ర‌మంలో హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను డిజైన్ చేసిన తీరు తెన్నులు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. ఫ‌స్టాఫ్‌లో ఉన్న క‌చ్చిత‌త్వం, ఎంట‌ర్‌టైన్మెంట్‌ను ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌లో క్యారీ చేయ‌లేక‌పోయారు. తన క్యారక్టరైజేషన్ మరియు హీరోయిన్ గ్లామ్ షో లు మ్యూజికల్ గా సాగే ఎంటర్టైనింగ్ కథనం వంటివి మంచి హైలైట్ అయ్యి డెఫినెట్ ఎంటర్టైనర్ గా నిలుపుతాయి. కాకపోతే చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే ఈ డీజే టిల్లు వీకెండ్ లో మాంచి ఎంటర్టైన్మెంట్ ని అందరికీ అందిస్తాడు.

 

Tags :