రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించే శక్తి... కేసీఆర్‌కు లేదు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ సభకు పది లక్షల మంది వస్తారని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ బృందం పరిశీలించిందన్నారు. సికింద్రాబాద్ అల్లర్లు వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజం మోదీ నాయకత్వంలోని బీజేపీ వైపు చూస్తోందన్నారు. హైదరాబాద్ నగరం కాషాయ మాయంగా మారబోతుందన్నారు. సీఎం కేసీఆర్ మాటలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. అగ్నిపథ్‌పై మంత్రి కేటీఆర్‌వి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసిందే సీఎం కేసీఆర్ హయాంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు.
Tags :