మంత్రి కేటీఆర్ తో డీఎంకే ఎంపీలు భేటీ

మంత్రి కేటీఆర్ తో డీఎంకే ఎంపీలు భేటీ

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేసీఆర్‌ను డీఎంకే ఎంపీలు తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. నీట్‌పై  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖను ఎంపీలు ఎల్‌ఎం గోవింద్‌, వీరస్వామి కలిసి మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నామని డీఎంకే ఎంపీలు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాసిన లేఖ పట్ల మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు.  దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ రద్దు కోరుతూ పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖ రాసిన విషయం విదితమే.

 

Tags :