కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...ఇకపై ఇంట్లోనే

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...ఇకపై ఇంట్లోనే

గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త. సిలిండర్‌ వెయిటేజీ నుంచి డెలివరీ వరకు ఇలా అన్నీ రకాల విభాగాల సమాచారం వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో వినియోంగిచే గ్యాస్‌ సిలిండర్లకు క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థను అమలు చేయనుంది. ఇటీవల కాలంలో గ్యాస్‌ కంపెనీలపై వినియోగదారులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. గ్యాస్‌ సంస్థలు ప్రకటించినట్లుగా కాకుండా తమకు 1 నుంచి 2 కేజీల గ్యాస్‌ తగ్గతుందని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, బుక్‌ చేసిన గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ టైంకు రావడం లేదనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదులపై కేంద్రం స్పందించి. కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌  పూరి ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్‌ సిలిండర్లను క్యూఆర్‌ కోడ్‌తో మెటల్‌ స్టిక్కర్‌ను అందించనున్నట్లు తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.