నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చర్చలు ... దాంతో అతడు

నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చర్చలు ... దాంతో అతడు

తాలిబన్లతో చర్చల సందర్భంగా తాను ఆ ముఠా ఆగ్ర నాయకుడిని గట్టిగా బెదిరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఆ నాయకుడి ఇంటి శాటిలైట్‌ ఫొటోను పంపించి హెచ్చరించానని అన్నారు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాలిబన్లతో చర్చలు జరిపా. ఆ సమయంలో  ఓ సారి తాలిబన్‌ ఉగ్ర ముఠా సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు ఆయన ఇంటి శాటిలైట్‌ ఫొటోను పంపించా. మా ఇంటి ఫొటోను ఎందుకు పంపించారు? అని బరాదర్‌ అడిగాడు. అప్పుడు అతడికి నేను ఒక్కటే చెప్పా. మా సైనికుల్లో ప్రాణం పోయినా మిమ్మల్ని సర్వనాశనం చేస్తానని హెచ్చరించా. దాంతో అతడు భయపడి వెనక్కి తగ్గాడని ట్రంప్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలో అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సైనిక ఉపసంహరణపై ట్రంప్‌ విమర్శలు చేశారు. తాను అధ్యక్ష హోదాలో ఉంటే బిలియన్‌ డాలర్ల విలువ చేసే అమెరికా సైనిక పరికరాలను ఆ దేశంలో వదిలివచ్చేందుకు అంగీకరించేవాడిని కాదన్నారు. బైడెన్‌ ఆనాలోచిత ఉపంసహరణ ప్రక్రియ కారణంగా అమెరికా 13 మంది సైనికులను కోల్పోయిందని, ఎంతో మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని విచారం వ్యక్తం చేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.