వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతివ్వకపోతే.. మరో పార్టీ నుంచి : ట్రంప్

వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతివ్వకపోతే.. మరో పార్టీ నుంచి : ట్రంప్

వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించకపోతే మూడో పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని రిపబ్లికన్‌ పార్టీకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతమిచ్చారు. ఈ మేరకు తన సోషల్‌ అకౌంట్‌లో ద కమింగ్‌ స్ల్పిట్‌ పేరిట రాసిన కథనంతో పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థిగా తనకు మద్దతివ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని అందులో హెచ్చరించినట్లు తెలిసింది. రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి రేసులో ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌  డీసాంటిస్‌  ముందు వరుసలో ఉన్నారు.

 

 

Tags :