డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ మరోసారి షాకిచ్చింది. కొత్త ఖాతా ట్రూత్ సోషల్ను కూడా ట్విట్టర్ నిషేధించింది. ట్విట్టర్లో ట్రంప్ ఖాతాపై నిషేధం విధించినప్పటి నుండి ట్రూత్ సోషల్ ద్వారా మద్దతుదారులకు తన సందేశాలు పంపుతున్నారు. ప్రెస్ ట్రంప్ టిఎస్ యూజన్ నేమ్‌తో ట్విట్టర్లో పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే ఇది ఎంతోకాలం సాగలేదు. తాజాగా దీనిపై కూడా నిషేధం విధిస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. ఈ ఖాతాపై నిషేధం విధించే సమయానికి ఆ ఖాతాలో 210 ట్వీట్స్ ఉన్నాయి. దయచేసి అనుసరించండి, రీ ట్వీట్ చేయండి అనే క్యాప్షన్‌తో ట్రూత్ సోషల్ ద్వారా కాపీ, పేస్ట్ చేసినట్లు హఫ్ పోస్ట్ తెలిపింది.
Tags :