పుతిన్ అలా అనకూడదు... ట్రంప్

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరచూ అణు మాట (న్యూక్లియర్ వర్డ్) ఎత్తుతుండటాన్ని ట్రంప్ తప్పపట్టారు. తాను ఇప్పటికీ అమెరికా అద్యక్ష పదవిలో ఉంటే పుతిన్ అలా అనకుండా ప్రయత్నించేవాడినని పేర్కొన్నారు. ఈ పదాన్ని ట్రంప్ ఎన్`వర్డ్ గా అభివర్ణించారు. మీరు ఇప్పటికే అమెరికా అధ్యక్షడిగానే ఉంటే ఉక్రెయిన్‌లో ఏం చేసేవారు అని ప్రశ్నకు ట్రంప్ ఆసక్తికరమైన జవాబిచ్చారు. పుతిన్ ప్రతి రోజు ఎన్ వర్డ్‌ని వాడుతున్నారు. అది సరికాదు. దీనివల్ల ప్రతి ఒక్కరూ చాలా చాలా భయపడుతున్నారు. అలా వాళ్లు భయపడుతున్న కొద్దీ పుతిన్ మరింతగా ఆ మాట వాడుతున్నారు. ఆయన అలా అనకూడదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Tags :