అమెరికా చరిత్రలోనే పెద్ద ఓటమి

అమెరికా చరిత్రలోనే పెద్ద ఓటమి

ఎటువంటి ప్రతిఘటన లేకుండా తాలిబన్లకు కాబూల్‍ను వదిలిపెట్టడం అమెరికా చరిత్రలోనే పెద్ద ఓటమి అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ అన్నారు. కాబూల్‍లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు ఆక్రమించారని, ఆ దేశ అధ్యక్షుడు అశ్రఫ్‍ఘనీ తన ముఖ్య అనుచరులతో కలిసి తజికిస్థాన్‍ పారిపోయారన్న వార్తలు గుప్పుమన్న కొన్ని గంట్లోనే ట్రంప్‍ స్పందించారు. అఫ్గానిస్థాన్‍ కోసం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‍ ఏమీ చేయలేదని విమర్శించారు. అఫ్గాన్‍ పరిణామాలపై అధ్యక్షుడు జో బైడెన్‍ నుంచి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు  రాకపోవడం గమనార్హం.

 

Tags :