విచారణకు హాజరైన డొనాల్డ్ ట్రంప్

విచారణకు హాజరైన డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ముందు విచారణకు హాజరయ్యారు. అధ్యక్షుడు అవకముందు ట్రంప్‌ తన గోల్ఫ్‌ కోర్సులు, బహుళ అంతస్తుల భవనాల విలువను ఎక్కువ చేసి చూపి రుణదాతలను తక్కువగా చూపి పన్ను అధికారులను బురిడి కొట్టించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటీషియో జేమ్స్‌ విచారణ జరిపారు. లెటేషియా ప్రశ్నలకు జవాబివ్వకుండా తప్పించుకోవడానికి ట్రంప్‌ అమెరికా రాజ్యాంగంలోని అయిదో సవరణను ఉపయోగించుకున్నారు. అయితే రాజకీయ దురుద్దేశాలతోనే తన స్థిరాస్తి వ్యాపారాలపై విచారణ సాగుతోందని ఆయన ఆరోపించారు. తనపైన, తన కంపెనీ పైన అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయని వాపోయారు. అమెరికాను నిరంకుశ దేశాలతో పోలుస్తూ బనానా రిపబ్లికన్‌గా అభివర్ణించారు.

 

Tags :