డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్

డొనాల్డ్  ట్రంప్‌కు మరో షాక్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌ తగిలింది. 25 సంవత్సరాలలో తొలిసారిగా అమెరికాలోని అత్యంత ధనంతుల ఫోర్బ్స్‌ 400 జాబితాలో స్థానాన్ని కోల్పోయాడు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం కరోనా ప్రారంభమైనప్పటి నుండి అతను 600 మిలియన్‌ డాలర్లు సంపదను కోల్పోయాడు. ట్రంప్‌ సంపద విలువ 2.5 బిలియన్‌ డాలర్లు. ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకోవాలంటే మరో 400 మిలియణ్‌ డాలర్లు అవసరమని ఫోర్బ్స్‌ వ్యాఖ్యానించింది. అధ్యక్షుడిగా ఓటమి పాలనై ట్రంప్‌ ఆస్తులు విలువ ఏమాత్రం పెరగలేదు. అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల జాబితాలో డొనాల్డ్‌ ట్రంప్‌కు చోటు దక్కలేదు. తాజాగా ఫోర్బ్స్‌ 400 జాబితాలో ట్రంప్‌ చోటు కోల్పోవడం గత 25 ఏళ్లల్లో ఇదే తొలిసారని ఫోర్బ్స్‌ వెల్లడిరచింది.

 

Tags :