MKOne Telugu Times Business Excellence Awards

జో బైడెన్ ను హేళన చేసిన డొనాల్డ్ ట్రంప్

జో బైడెన్ ను హేళన చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆయన రాజకీయ ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హేళన చేశారు.  ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌ న్యూహాంప్‌షైర్‌ లో ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఆయన బైడెన్‌ను అనుకరిస్తూ వేళ చేశారు. ప్రసంగం మధ్యలో బైడెన్‌లా మాట్లాడవలసింది మరిచిపోయినట్లు నటించారు. ఆ తరువాత స్టేజీ దిగేందుకు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడినట్లు నటిస్తూ తన మద్దతుదారులను నవ్వించారు. చివరకు ఎడమ వైపు చేయి చూపిస్తూ అటు వైపు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ట్రంప్‌ నడవడం బైడెన్‌ను గుర్తుకు తెచ్చింది. దీనితో సభలో ఆయన మద్దతుదారులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రెండు రోజులకే ట్రంప్‌ ఆయనను హేళన చేసేలా అనుకరించడం ప్రస్తుతం చర్చనీయం అవుతోంది.

 

 

Tags :