MKOne TeluguTimes-Youtube-Channel

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తా

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తా

మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధించగల వ్యక్తిని తానేనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. 2024లో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకుంటున్న ట్రంప్‌ ఆ దిశగా ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఇక ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ  మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందని తాను నిజంగా నమ్ముతున్నానని, ప్రపంచానికి ఇంత కంటే ప్రమాదకరమైన సమయం ఎన్నడూ రాబోదని అన్నారు. జో బైడెన్‌ రష్యాను చైనా చేతుల్లోకి తీసుకెళ్లారని ఆరోపించారు. ఇది అణు యుద్దానికి దారితీస్తుందని అన్నారు. ఈ పరిపాలన మూడవ ప్రపంచ యుద్ధంతో ముగుస్తుంది. ఎందుకంటే బైడెన్‌ సరిగ్గా మాట్లాడరు. మంచిగా ప్రవర్తించవలసినప్పుడు కఠినంగా, కఠినంగా ప్రవర్తించవలసినప్పుడేమో మృదువుగా ప్రవర్తిస్తారు. నిజాయతీగా చెప్పాలంటే అసలు వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు. అటువంటి వారితో మనం మూడవ ప్రపంచ యుద్ధంతో అంతం అవుతాం అని అన్నారు. 2024లో తాను విజయం సాధించినట్లుయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్దాన్ని 24 గంటల్లో ముగిస్తానని ట్రంప్‌ తెలిపారు. గంలో కూడా  ట్రంప్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను రెండోసారి అధికారంలోకి వస్తే ఈ విధానానికి స్వస్తి చెప్పగలనని ఆయన సూచించారు. వ్లాదిమిర్‌ పుతిన్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందని, రష్యా అధ్యక్షుడు తన మాట వింటారని తెలిపారు.

 

 

 

Tags :