అమెరికా అంటూ వ్యాధుల నిపుణుడు కూడా... కరోనా

అమెరికా అంటూ వ్యాధుల నిపుణుడు కూడా... కరోనా

అమెరికా అంటూ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ కరోనా బారిన పడ్డారు. 81 ఏండ్ల ఫౌసీ పూర్తిగా రెండు వ్యాక్సిన్లు తీసుకున్నారు.  పైగా రెండు బూస్టర్‌ డోసులు కూడా తీసుకున్నారు. అయినా ఆయనకు స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు కనిపించాయని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫౌసీ ఇటీవలి రోజుల్లో అధ్యక్షుడు జో బైడెన్‌ను లేదా ఇతర సీనియర్‌ ప్రభుత్వ అధికారులను కానీ కలవలేదు. రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది.

 

Tags :