పద్మభూషణ్ బాలకృష్ణ దోషి ఇక లేరు

పద్మభూషణ్ బాలకృష్ణ దోషి ఇక లేరు

దశాబ్దాల పనితనంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రముఖ ఆర్కిటెక్ట్‌ నిపుణులు, పద్మ భూషణ్‌ బాలకృష్ణ దోషి ఇక లేరు. అహ్మదాబాద్‌లోని తన స్వగృహంలో ఆయన అనారోగ్యంతో కన్ను మూసినట్లు తెలుస్తోంది.  ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. లె కార్బూజియెగా (ఛార్లెస్‌ ఎడ్వర్డ్‌ జెనరెట్‌), లూయిస్‌ కాన్‌ లాంటి విదేశీ ఆర్కిటెక్ట్‌లతో కలిసి పని చేసిన అనుభవం ఆయనది. అహ్మదాబాద్‌ ఐఎంఎంతో పాటు పలు ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణంలో ఆయన పాలు పంచుకున్నారు. డాక్టర్‌ బివి దోషి జి ఒక తెలివైన వాస్తుశిల్పి, గొప్ప సంస్థకు నిర్మాత. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి, ఓ  శాంతి అని ట్వీట్‌ ద్వారా సంతాపం తెలియజేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దోషి మృతిపై పలువురు ప్రముఖులు నివాళుల్పంచారు.  

 

 

Tags :