తెలంగాణకు దక్కిన అరుదైన అవకాశం..

తెలంగాణకు దక్కిన అరుదైన అవకాశం..

అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ డా.కేశవులు ఎంపికయ్యారు. ఈజిప్ట్‌ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్‌ సదస్సులో భాగంగా ఇస్టా 2022`25 కాలానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి అరుదైన అవకాశం లభించింది. ఇస్టా అధ్యక్షుడిగా కేశవులును ఎన్నుకున్నారు.2019లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రంగా ఇస్టా సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సు నిర్వహణ తీరుపట్ల ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అనాటి సదస్సు లో ఇస్టా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా కేశవులు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘానికి అందజేస్తున్న సేవలను గుర్తించి ఆయన సేవలను మరింత ఉపయోగించుకునేందుకు ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. ఇస్టా ఉపాధ్యక్షుడిగా యు.ఎస్‌కు చెందిన ఎర్నైస్ట్‌ అలెన్‌ ఎన్నికయ్యారు.

 

Tags :