తెలుగు మహిళకు అరుదైన గుర్తింపు

తెలుగు మహిళకు అరుదైన గుర్తింపు

పీడియాట్రిక్‌ డెంటిస్టుల అఖిల భారత సంఘం ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ పిడొడాంటిక్స్‌ అండ్‌ ప్రివెంటివ్‌ డెంటిస్ట్రీ (ఐఎస్‌పీపీడీ) అధ్యక్ష బాధ్యతలను ఓ తెలుగు మహిళ చేపట్టారు. నవంబరు 24-26 వరకు భోపాల్‌లో జరిగిన 43వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పీడోటల్‌-2022లో డా. రాధిక ముప్పు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి దంత వైద్యురాలిగా ఆమె అరుదైన గుర్తింపు  సాధించారు. ఇది తనకు అరుదైన గౌరవమని ఈ సందర్భంగా రాధిక అన్నారు. దేశంలోని ప్రతి చిన్నారి మోముపై అందమైన చిరునవ్వు సృష్టించాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అమూల్య డెంటల్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్నారు.

 

Tags :