డాక్టర్ రెడ్డీస్ కు యూఎస్ఏ ఎటాన్ ఫార్మా ఔషధాలు

అమెరికాలోని ఇలినాయిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎటాన్ ఫార్మాస్యూటికల్స్ చెందిన కొన్ని ఇంజెక్టబుల్ ఔషధాలు, బ్రాండ్లను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కొనుగోలు చేసింది. దీనికి ప్రతిఫలంగా ఎటాన్ ఫార్మాకు డాక్టర్ రెడ్డీస్ ప్రస్తుతం 5 మిలియన్ డాలర్ల నగదు చెల్లిస్తుంది. తదుపరి దశల వారీగా 45 మి. డాలర్ల వరకు చెల్లించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 50 మి. డాలర్ల వరకు ఎటాన్ ఫార్మాకు అందజేయాల్సి ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేస్తున్న ఔషధాల్లో బయార్పెన్ ఇంజెక్షన్, రేజిప్రెస్ ఇంజెక్షన్, ఏఎన్డీఏ అనుమతి ఉన్న సిస్టైన్ హైడ్రోక్లోరైడ్ ఉన్నాయి. ఈ ఔషధాలు తన చేతికి వచ్చినందున అమెరికాలో ఆదయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సీఈఓ (ఉత్తర అమెరికా జనరిక్స్ విభాగం) మార్క్ కికుచి పేర్కొన్నారు.
Tags :