అమెరికా విపణిలోకి డాక్టర్ రెడ్డీస్ ఔషధం

కంటి శస్త్రచికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్, అలర్జీ వల్ల కళ్లలో వచ్చే నొప్పి, వాపు చికిత్సలో ఉపయోగించే డిప్లూప్రెడ్‌నేట్ ఆప్తాల్మిక్ ఎమల్షన్‌ను అమెరికా మార్కెట్లో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ విడుదల చేసింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన తర్వాత డ్యూరెజోల్ (డిప్లుప్రెడ్ నేట్ ఆప్తాలిక్ ఎమల్షన్ 0.05 శాతం) జనరిక్ వెర్షన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డ్యూరోజోల్ బ్రాండు, జెనరిక్స్ ఔషధ విక్రయాలు గత ఏడాది నవంబరుతో ముగిసిన 12 నెలల కాలానికి 40 మిలియన్ డలార్ల మేర జరిగాయి.
Tags :