శ్రీవారి భక్తులకు తీపికబురు... వారికి మరో అవకాశం

శ్రీవారి భక్తులకు తీపికబురు... వారికి మరో అవకాశం

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపికబురు అందించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షల కారణంగా స్వామివారి దర్శనానికి రాలేని భక్తులకు ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పించింది. నవంబర్‌ 18 నుంచి 30వ తేదీ వరకు ఎలాంటి కారణంతోనైనా శ్రీవారి దర్శనానికి రాలేకపోతే భక్తులకు మరో సమయంలో స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయించింది. నవంబరు 25 నుంచి 28వ తేదీ వరకు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈవో జవహర్‌ రెడ్డిని,  చైర్మన్‌ వైఈ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఇప్పటికే దర్శన టికెట్లు ఉన్న భక్తుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించి వచ్చే 6 నెలల్లోగా తిరిగి స్లాట్‌ బుక్‌ చేసుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Tags :