డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దీపావళి సంబరాలు

డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దీపావళి సంబరాలు

డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. శనివారం నాడు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు. ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ & సింగర్ రఘు కుంచె, ప్లేబాక్ సింగర్స్ అదితి భవరాజు, మౌనిమ తమ లైవ్ మ్యూజిక్‌తో అందరినీ అలరించారు. స్థానికంగా ఉండే చిన్నారులు, పెద్దలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. కాంటన్‌లోని హిందూ దేవాలయం వేదికగా జరిగిన ఈ వేడుకలకు 1000 మందికి పైగా హాజరైన ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ వేడుకల్లో భాగంగా కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్, వడ్లమూడి వెంకటరత్నం అవార్డ్, స్పోర్ట్స్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్, కమ్యూనిటీ సర్వీస్ లీడర్‌షిప్ అవార్డులను పలువురికి అందజేశారు. 46 వసంతాలు పూర్తి చేసుకున్న డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలకు పలువురు డీటీఏ మాజీ అధ్యక్షులు, స్థానిక తెలుగు కమ్యూనిటీ, తానా నాయకులు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలకు స్పాన్సర్స్‌గా వ్యవహరించిన తానా-2023 కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంట్రను ఘనంగా సన్మానించడం జరిగింది.

అనంతరం పసందైన పండుగ భోజనం అందరికీ నచ్చింది. చక్కగా అలంకరించిన ఫోటోబూత్‌లలో మహిళలు ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. ఇదే సమయంలో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ) నూతన అధ్యక్షుడిగా కిరణ్ చౌదరి దుగ్గిరాల ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో నరేన్ కొడాలి, శ్రీనివాస్ గోగినేని, జగదీశ్ ప్రభల, మోహన్ ఈదర, జోగేశ్వరరావు పెద్దిబోయిన, శ్రీనివాస్ కోనేరు, వెంకట్ ఎక్కా, రమణ ముడేగంటి, హర్ష అంచె, నీలిమ మన్నే, సుధీర్ బాచు, ద్వారక ప్రసాద్ బొప్పన, సత్యం నెరుసు, నాగేందర్ అయిత, వెంకట్ మంతెన తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Click here for Event Gallery

 

 

Tags :
ii). Please add in the header part of the home page.