వాళ్లను బాగుచేసే పని ఒక్కటి... ఈ ప్రభుత్వం చేయలేదు

వాళ్లను బాగుచేసే పని ఒక్కటి... ఈ ప్రభుత్వం చేయలేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులను బాదే కార్యక్రమం తప్ప, వాళ్లును బాగుచేసే పని ఒక్కటీ ఈ ప్రభుత్వం చేయడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. టీటీడీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుభరోసా పేరుతో ఇతర పథకాలను ఆపేశారని అన్నారు. రైతులను కులాల పేరుతో వైసీపీ ప్రభుత్వం విభజిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ మీటర్లు పెట్టబోమని పక్కనే ఉన్న తెలంగాణ తేల్చి చెప్పిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం కేంద్రానికి దాసోహమైందని ఆక్షేపించారు. మీ స్వార్థం కోసం రైతులను ఎందుకు బలి చేస్తారని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. రైతుల మెడపై కత్తిపెట్టి మీటర్లు ప్టెటడం ఎందుకు ? రాయితీ ఇవ్వడం ఎందుకు? అని నిలదీశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఎత్తేసేందుకు కుట్రలా కనబడుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

 

Tags :