కెనడా దేశం లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

కెనడా దేశం లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

* కెనడా దేశం లోని ఒంటారియో రాష్ట్రం లో వున్న డుర్హం రీజినల్ తెలుగు వారంతా కలిసి దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.  

* డుర్హం తెలుగు సంస్థ ఆద్వర్యం లో గ్రాండ్ దీపావళి ఈవెంట్ ని ఈ నెల 13 వ తారీఖున కెనడా ఓషావా నగరం లో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల కేరింతలతో, సాంస్కృతిక కార్యక్రమాల తో వేదిక కన్నుల పండుగయింది.

* ఈ వేడుక కు ముఖ్య అతిధి గా కెనడా MP- Hon.. Ryan Turnbull విచ్చేసి దీపావళి సంబరాలను ప్రారంభించారు. ఈ సంవత్సరం అద్భుత విజయాలను సాధించిన తెలుగు వారిని అభినందిస్తూ షీల్డ్స్ బహుకరించారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగు ప్రముఖులను సత్కరించారు.  

* భారతీయ సంస్కృతీ ప్రపంచానికి ఎంతో నేర్పించింది, భారతీయుల కృషి కెనడా దేశ అభివృద్ధిలో బాగమైందని Hon.. Ryan Turnbull, M.P కొనియాడారు. డుర్హం తెలుగు వాసుల అందిరికి తన అండ దండలు ఎప్పుడు వుంటాయని Hon. MP Ryan గారు తెలియచేసారు.

* ఈ కార్యక్రమం లో తెలుగు వారందరి తరపున రమేష్ ఉప్పలపాటి గారు దీపావళి పండుగ ను కెనడా నేషనల్ హాలిడే గా (National Holiday) ప్రకటించేందుకు కెనడా పార్లమెంట్ లో కృషి చేయాలనీ విజ్ఞప్తి చేసారు. దానికి Hon. MP Ryan గారు సానుకూలంగా స్పందించి తప్పకుండ తన అభిప్రాయాన్ని కెనడా పార్లమెంట్ సమావేశాలలో వినిపిస్తానని తెలియచేశారు.

* ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డీటీసీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి మరియు కార్య వర్గ సభ్యులు అయిన రవి మేకల, గౌతమ్ పిడపర్తి, శ్రీకాంత్ సింగిశెట్టి, వెంకట్ చిలువేరి, సర్ధార్ ఖాన్ మరియు కమలమూర్తి లను ఆయన ప్రశంసించారు.

*  550 సభ్యులు పాల్గొన్నారు. వివిధ క్రీడా, ఆటల, సాహిత్య కార్యక్రమాలతో దీపావళి పటాసులు వెలిగించి, షడ్రసోపేతమయిన తెలుగు వంటకాలు ఆరగించారు.

* టొరంటో తెలుగు టైమ్స్ సంపాదకులు గౌ. సర్దార్ ఖాన్ గారు ఈ కార్యక్రంలో పాల్గొని తెలుగు సభ ద్విగ్విజయంగా ముగిసింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని డీటీసీ చేసే  ప్రయత్నం ఫలించింది.

Click here for Event Gallery

 

Tags :