తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం... షాక్

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం... షాక్

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఝలక్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ప్రచారానికి బ్రేక్‌ పడింది. సాలు దొర.. సెలవు దొర పేరుతో కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ బీజేపీ చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిలుపుదల చేసింది. ఆ ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఫొటోలతో పోస్టర్లు ముద్రించేందుకు బీజేపీ అనుమతి కోరగా ఎన్నికల సంఘం నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాత ఉండకూడదని ఖరాఖండీగా ఎన్నికల కమిషన్‌ తెలిపింది. బీజేపీ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

 

Tags :