MKOne Telugu Times Youtube Channel

నేషనల్ హెరాల్డ్ కేసు..ఈడీ అధికారులకు రాహుల్ ఏం చెప్పారంటే

నేషనల్ హెరాల్డ్ కేసు..ఈడీ అధికారులకు రాహుల్ ఏం చెప్పారంటే

నేషనల్‌ హెరాల్డ్‌ మనీల్యాండరింగ్‌ కేసులో మూడో రోజు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా యంగ్‌ ఇండియన్‌ కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్‌ దర్యాప్తు అధికారులతో స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ సంస్థ నుంచి తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్‌ స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే 2010లో కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచి యంగ్‌ ఇండియన్‌ ఏ ఒక్క దాతృత్వ కార్యక్రమం చేపట్టలేదని రాహుల్‌ వాదనను ఈడీ అధికారులు తోసిపుచ్చినట్టు తెలిసింది. యంగ్‌ ఇండియన్‌ ఎలాంటి దాతృత పనులు చేపట్టినదని తెలిపే పత్రాలు, ఆధారలను సమర్పించాలని ఈడీ అధికారులు రాహుల్‌ను కోరారని ఆ వర్గాలు తెలిపాయి.

 

Tags :