MKOne TeluguTimes-Youtube-Channel

ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. దర్యాప్తులో భాగంగా కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, తాను హాజరుకాలేనని అధికారులకు ఈ`మెయిల్‌ ద్వారా లేఖ పంపిన విషయం తెలిసిందే. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో తేదీని ఖరారు చేస్తూ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిష్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని, కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారణకు తీసుకుంటున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది. ఆమె పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తక్షణమే విచారించేందుకు  నిరాకరించిన సీజేఐ ధర్మానం ఈ నెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 

 

 

Tags :