ద్రవ్యోల్బణం కారణంగా ...విదేశీ పెట్టుబడులు వెనక్కి

ద్రవ్యోల్బణం కారణంగా ...విదేశీ పెట్టుబడులు వెనక్కి

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం కారణంగా జూన్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) అమ్మకాలను కొనసాగించారు. ఈ నెలలో ఇప్పటి వరకు భారతీయ స్టాక్‌ల నుంచి ఎఫ్‌పిఐలు దాదాపు రూ.31,430 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో ఎఫ్‌పిఐలు ఇప్పటి వరకు రూ.1.98 లక్షలకోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఎఫ్‌పిఐల ట్రెండ్‌ రాబోయే రోజుల్లో ఆస్థిరంగానే ఉంటుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల ద్రవ్య వైఖరి కఠినతరం వంటి కారణాల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. డేటా ప్రకారం ఎఫ్‌పిఐలు ఈ నెల జూన్‌ 17 వరకు భారతీయ స్టార్‌ మార్కెట్ల నుండి రూ.31,430 కోట్లను ఉపసంహరించుకున్నారు. 2021 అక్టోబర్‌ నుండి ఎఫ్‌పిఐ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

 

Tags :