తాలిబన్ లకు మరోమారు చావుదెబ్బ

తాలిబన్ లకు మరోమారు చావుదెబ్బ

పంజ్‍షీర్‍ ప్రావిన్స్ లో ప్రతాపం చూపించాలని తాలిబన్ ల ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. అమెరికా సేనలు వెళ్లిన కొద్దిసేపటికే పంజ్‍షీర్‍పై తాలిబన్లు విరుచుకుపడ్డారు. అయితే, ప్రతిఘటన దళాలు వీరిని చావుదెబ్బతీశాయి. దాంతో అఫ్గాన్‍ను ఆక్రమించిన తాలిబన్లకు మరోమారు పరాభవం ఎదురైంది. ఈ పోరులో తాము ఏడు నుంచి ఎనిమిది మంది తాలిబన్ లను మట్టుబెట్టినట్టు అహ్మద్‍ మసౌద్‍ అధికార ప్రతినిధి ఫాహిత్‍ దప్తీ తెలిపారు. ఇరువైపులా కొందరికి గాయాలైనట్టు పేర్కొన్నారు. పంజ్‍షీర్‍లో తాలిబన్‍ వ్యతిరేక సలేహ్‍ సామాజిక చేతులు కలిపిన అఫ్ఘనిస్థాన్‍ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్‍ సామాజిక మాధ్యమాల ద్వారా బాహ్య ప్రపంచానికి మెసేజ్‍లు పంపకుండా ఉండేందుకు తాలిబన్ లు పంజ్‍షీర్‍లో ఇంటర్నెట్‍ను నిలిపివేశారు. అఫ్గానిస్తాన్‍లో భాగమైన పంజ్‍షీర్‍ ప్రావిన్సు తాలిబన్ లను వ్యతిరేకిస్తోంది.

 

Tags :